అత్యవసర కేసులే విచారిస్తాం: సుప్రీం

దేశంలో కరోనా వైరస్‌ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర కేసుల విచారణ మాత్రమే చేపట్టాలని నిర్ణయించింది. కేసుకు సంబంధించి....

Published : 13 Mar 2020 23:50 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర కేసుల విచారణ మాత్రమే చేపట్టాలని నిర్ణయించింది. కేసుకు సంబంధించి న్యాయవాదులు మినహా ఎవరికీ లోపలికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి సమూహాలుగా ఏర్పడకూడదంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనల మేరకు ఈ  నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం కోర్టు ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోర్టుకు వచ్చే సందర్శకులు, కక్షిదారులు, లాయర్లు, కోర్టు సిబ్బంది, విలేకరుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర కేసులు మాత్రమే విచారించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. కోర్టు రూముల్లోకి కేసుకు సంబంధించిన లాయర్లు మినహా ఇతరులకు ప్రవేశం లేదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని