ఒమర్‌ అబ్దుల్లాతో ఫరూక్‌ భేటీ

 జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా తన తనయుడు ఒమర్‌ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. శ్రీనగర్‌లోని సబ్‌ జైలులో గత ఏడు నెలలుగా,,......

Published : 14 Mar 2020 23:21 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా తన తనయుడు ఒమర్‌ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. శ్రీనగర్‌లోని సబ్‌ జైలులో గత ఏడు నెలలుగా నిర్బంధంలో ఉంటున్న తనయుడిని కలిశారు. ప్రజా భద్రత చట్టం (పీఎస్‌ఏ) కింద గృహ నిర్బంధం నుంచి శుక్రవారం ఫరూక్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కుమారుడిని కలిసేందుకు అనుమతివ్వాలని జమ్మూకశ్మీర్‌ అధికారులను కోరారు. అందుకు వారు సమ్మతించారు. తండ్రీ కొడుకులిద్దరూ సుమారు గంట పాటు మాట్లాడుకున్నారని అధికారులు తెలిపారు.

ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఫరూక్‌ అబ్దుల్లాతో పాటు, ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సహా పలువురు కశ్మీరీ నేతలను ఆగస్టు 5 నుంచి నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 15న ఫరూక్‌పై పీఎస్‌ఏ ప్రయోగించగా..శుక్రవారంతో ముగిసింది. ఆయనకు స్వేచ్ఛ కల్పించారు.

ఇదీ చదవండి..
ఫరూక్‌ అబ్దుల్లాకు స్వేచ్ఛ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని