మహారాష్ట్రలో కొత్తగా మరో 12 కరోనా కేసులు

ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ తన పంజా విసురుతోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఆదివారం ఉదయం 93గా ఉన్న బాధితుల సంఖ్య ఇప్పుడు 107కు చేరింది.......

Updated : 06 Jul 2021 18:58 IST

దిల్లీ: ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ తన పంజా విసురుతోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఆదివారం ఉదయం 93గా ఉన్న బాధితుల సంఖ్య ఇప్పుడు 107కు చేరింది. ఈరోజు ఒక్క మహారాష్ట్రలోనే 12 కొత్త కేసులు నమోదుకావడం గమనార్హం. ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 31కి చేరింది. కేరళలో ఈ సంఖ్య 22కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో 11గా నమోదైంది. ఇక హరియాణాలో 14 కేసులు ధ్రువీకరించగా వారంతా విదేశీయులే. తెలంగాణలో మొత్తం మూడు కేసులు నిర్ధారణ అయినట్లు వైబ్‌సైట్లో పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే కేంద్ర జాతీయ విపత్తుగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. విద్యాసంస్థలు, దుకాణసముదాయాలు, థియేటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో ఇంకా ఆరోగ్య ఆత్యయిన పరిస్థితి విధించాల్సిన పరిస్థితులు ఏమీ లేవని తెలిపింది. అయితే అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. మరోవైపు ఇటలీ నుంచి భారత్‌కు చేరుకున్న 218 మందిని దిల్లీ సమీపంలోని ఐటీబీపీ స్థావరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రానికి తరలించారు. వారిని 14 రోజుల పాటు అక్కడే వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. మరోవైపు ఇరాన్‌ నుంచి చేరుకున్న 234 మందిని జైసల్మేర్‌కు తరలించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని