బహిరంగ ప్రదేశాల్లోనే ప్రార్థనలు

కరోనా విస్తరిస్తున్న క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా పలు మసీదులు మూసి వేయాలని మతపెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు అన్ని ప్రార్థనలు అక్సా మసీదు బహిరంగ ప్రదేశాల్లో..

Updated : 15 Mar 2020 23:58 IST

జెరూసలెం(ఇజ్రాయిల్‌): కరోనా వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా పలు మసీదులు మూసి వేస్తున్నట్లు ఇజ్రాయిల్‌లోని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు అన్ని ప్రార్థనలు మసీదు ప్రాంగణంలో బహిరంగ ప్రదేశాల్లో జరుగుతాయని అల్-అక్సా మసీదు డైరెక్టర్ ఒమర్ కిస్వానీ అన్నారు. అల్‌ అక్సా మసీదు, డోమ్‌ ఆఫ్‌ ది రాక్‌ మసీదుల తలుపులు మూసివేయనున్నారు.  కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తదుపరి నిర్ణయం ప్రకటించే వరకూ ఈ నిబంధన కొనసాగుతుందని తెలిపారు. కరోనాను అడ్డుకునేందుకు తమ దేశానికి మాస్కులు, మందులు అందించాలని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు భారత్‌ను కోరిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని