చైనాలో కరోనా కొత్త కేసులతో విమానాలు రద్దు

నావెల్‌ కరోనా జన్మస్థానం చైనాలో మూడు రోజుల తర్వాత ఓ కొత్త కేసు నమోదైంది. ఇక 54 మంది విదేశాల నుంచి వచ్చిన వారికి వైరస్‌ సోకింది. దీంతో అప్రమత్తమైన చైనా వెంటనే అంతర్జాతీయ విమానాల సంఖ్యను కుదించింది. సొంత దేశంలో వ్యాప్తి తగ్గినా బయట నుంచి వచ్చేవారితో మళ్లీ కేసులు...

Updated : 27 Mar 2020 16:46 IST

బీజింగ్‌: నావెల్‌ కరోనా జన్మస్థానం చైనాలో మూడు రోజుల తర్వాత ఓ కొత్త కేసు నమోదైంది. ఇక 54 మంది విదేశాల నుంచి వచ్చిన వారికి వైరస్‌ సోకింది. దీంతో అప్రమత్తమైన చైనా వెంటనే అంతర్జాతీయ విమానాల సంఖ్యను కుదించింది. సొంత దేశంలో వ్యాప్తి తగ్గినా బయట నుంచి వచ్చేవారితో మళ్లీ కేసులు పెరుగుతాయేమోనని ఆందోళన పడుతోంది!

అంతకు ముందు 67గా ఉన్న కొత్త కేసుల సంఖ్య గురువారం 55కు చేరుకుందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. దీంతో మొత్తం కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 81,340కి చేరుకుంది. కొత్తగా ఐదుగురు మృతిచెందడంతో మరణించిన వారి సంఖ్య 3,292కు చేరుకుంది. ఇతరదేశాల్లో ఉన్న చైనీయులు ఇప్పుడిప్పుడే స్వదేశానికి వెళ్తున్నారు. ఇప్పుడదే వారికి ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య రాజధాని షాంఘైలో 17, గ్వాంగ్‌డాగ్‌లో 12, బీజింగ్‌లో 4, తియాన్‌జింగ్‌లో 4 విదేశీ కేసులు నమోదయ్యాయి.

విదేశీ కేసులు పెరుగుతుండటంతో ఆదివారం నుంచి ఒక దేశానికి ఒక వారంలో ఒకే దారిలో ఒకే విమానం వెళ్లాలని నిబంధనలు జారీ చేసింది. విదేశాలకు చెందిన విమాన సంస్థలూ ఇవే నిబంధనలు పాటించాలి. ప్రస్తుతమున్న విమానాల్లో 90 శాతం రద్దు చేశారు. వచ్చే ప్రయాణికుల సంఖ్య రోజుకు 25వేల నుంచి 5000కు పరిమితం చేశారు. శనివారం నుంచి విదేశీయులకు ఆతిథ్య అనుమతి, వీసాలను తాత్కాలికంగా రద్దు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని