డబ్ల్యూహెచ్‌ఓపై ఆస్ట్రేలియా ప్రధాని విమర్శలు

కరోనావైరస్‌ వ్యాప్తికి కారణమైన చైనాలోని వ్యూహాన్‌ మాంసం మార్కెట్‌ను తిరిగి తెరవటం పట్ల ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌మారిసన్‌ డబ్యూహెచ్‌వోను విమర్శించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ

Published : 14 Apr 2020 23:57 IST

మెల్‌బోర్న్‌: కరోనావైరస్‌ వ్యాప్తికి కారణమైన చైనాలోని వ్యూహాన్‌ మాంసం మార్కెట్‌ను తిరిగి తెరవటం పట్ల ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌మారిసన్‌ డబ్యూహెచ్‌వోను విమర్శించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అర్ధరహితంగా వ్యవహరిస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు. వ్యూహన్‌లోని ఈ మార్కెట్లో పలు రకాల జంతువుల మాంసం అమ్ముతారు. అందువల్ల అక్కడి ప్రాంతమంతా శుభ్రత లేకుండా ఎప్పుడూ తడిగా ఉంటుంది. అసలే కరోనా పుట్టుకకు కారణమైన ఆ మార్కెట్‌ను మళ్లీ తెరవటంతో ప్రపంచం మరింత నష్టపోతుందంటూ మారిసన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రపంచానికి రక్షణగా ఉండాల్సిన డబ్ల్యూహెచ్‌ఓ వంటి అంతర్జాతీయ సంస్థలు ఒక దేశానికి కొమ్ముకాయడం శ్రేయస్కరం కాదన్నారు. ఆ మార్కెట్ తిరిగి తెరుచుకోవడంపై తాను పూర్తిగా విస్మయానికి గురైనట్టు తెలిపారు. ప్రపంచ దేశాధినేతలంతా వ్యూహన్‌ మార్కెట్ అత్యంత ప్రమాదకరమైనదని వాదిస్తున్నప్పటికి డబ్ల్యూహెచ్‌ఓ ఎందుకు ఆంగీరించడంలేదో అర్థం కావడంలేదన్నారు. దీనికి సమాధానంగా డబ్ల్యూహెచ్‌వో స్పందిస్తూ వ్యూహన్‌ మార్కెట్‌ అక్కడి ప్రజల ఆహార అవసరాలు తీర్చడానికి ప్రధానవనరు అని, అందుకే తిరిగి తెరిచేందుకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాక అక్కడి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారని, ఆ మార్కెట్‌పై డబ్ల్యూహెచ్‌ఓ నిరంతర పర్యవేక్షణ ఉంచినట్టు వెల్లడించారు. మరోవైపు ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 6400 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. వీరిలో 61 మంది మృత్యువాతపడ్డారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని