కరోనా: అక్కడ కనీసం 3 లక్షల మంది చనిపోతారు!

అత్యుత్తమంగా కొవిడ్‌-19 వ్యాప్తిని కట్టడి చేసినా ఆఫ్రికాలో ఈ ఏడాది కనీసం మూడు లక్షల మంది చనిపోతారని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ మోడల్‌ ఆధారంగా ...

Updated : 17 Apr 2020 19:07 IST

ముంబయి: అత్యుత్తమంగా కొవిడ్‌-19 వ్యాప్తిని కట్టడి చేసినా ఆఫ్రికాలో ఈ ఏడాది కనీసం మూడు లక్షల మంది చనిపోతారని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ మోడల్‌ ఆధారంగా ఓ నివేదిక తెలిపింది. ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోతే 33 లక్షల వరకు మృతిచెందే ప్రమాదం ఉందని పేర్కొంది.

చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచమంతా అతలాకుతలం చేస్తోంది. విపరీతమైన వేగంతో వ్యాపిస్తూ అగ్రరాజ్యాలను వణకిస్తోంది. ఆస్పత్రులపై ఊపిరి సలపని ఒత్తిడిని పెంచింది. ఈ మహమ్మారి నుంచి ఎప్పుడెప్పుడు తప్పించుకుంటామా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 21 లక్షల మందికి పైగా వైరస్‌ సోకగా 1.47 లక్షల మంది మృతిచెందారు. శుక్రవారానికి ఆఫ్రికాలో 18,000 కేసులు నమోదయ్యాయి. ఐరోపా తరహాలో ఇక్కడ వైరస్‌ విజృంభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

వైరస్‌ కట్టడి చేయకపోతే, ఎలాంటి చర్యలు తీసుకోకుంటే ఆఫ్రికాలో కనీసం 33 లక్షల మంది చనిపోతారని 120 కోట్ల మందికి వైరస్‌ సోకే ప్రమాదముందని ఆఫ్రికాపై ఐరాస ఆర్థిక కమిషన్‌ ఓ నివేదిక విడుదల చేసింది. కఠినంగా వ్యక్తిగత దూరం పాటిస్తే అత్యుత్తమ పరిస్థితుల్లో 12.2 కోట్ల మందికి వైరస్‌ సోకుతుందని అంచనా వేసింది. అధునాతన వైద్య వ్యవస్థలు లేని ఆఫ్రికాలో ఏం జరిగినా కష్టమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చదవండి: నకిలీ కరోనాపై యుద్ధభేరి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని