బిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్‌ ప్రధాని సహచరి

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు కాబోయే భార్య క్యారీ సిమండ్స్‌ బుధవారం పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. లండన్‌లోని ఓ ఆసుపత్రిలో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. కరోనా బారిన పడ్డ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కోలుకొని..

Updated : 29 Apr 2020 18:08 IST

 

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు కాబోయే భార్య క్యారీ సిమండ్స్‌ బుధవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. లండన్‌లోని ఓ ఆసుపత్రిలో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. కరోనా బారిన పడ్డ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కోలుకొని సోమవారం నుంచే విధుల్లో పాల్గొంటున్నారు. సిమండ్స్‌కు కూడా లక్షణాలు బయటపడ్డప్పటికీ ఆమె తొందరగా కోలుకున్నారు. గతేడాది జూలైలో బోరిన్‌ జాన్సన్‌ ప్రధాని అయినప్పటినుంచి సిమండ్స్‌ కూడా ఆయనతోపాటే ఉంటోంది. తమ మొదటి సంతానానికి జన్మనివ్వనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వారు ప్రకటించారు. ఆయన గతంలో మరీన వీలర్‌ను వివాహం చేసుకోగా వారికి నలుగురు సంతానం కలిగారు. కాగా 2018 సెప్టెంబర్‌లో విడిపోతున్నట్లు వారు ప్రకటించారు. ఈ ఏడాది మొదట్లోనే విడాకులు కూడా తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని