ప్లాస్మాదానం చేసిన నటి.. మంత్రి మెచ్చుకోలు

రెండోసారి ప్లాస్మా దానం చేసిన నటి జోయా మోరానీకి మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated : 27 May 2020 20:09 IST


 

ముంబయి: రెండోసారి ప్లాస్మా దానం చేసిన నటి జోయా మోరానీకి మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీం మోరానీ కుమార్తె అయిన ఆమె కొవిడ్ బారిన పడి, కోలుకున్నారు. అయితే కొవిడ్ చికిత్స నిమిత్తం ప్లాస్మా థెరపీ పరీక్షల కోసం వైరస్‌ నుంచి కోలుకున్న ఆమె.. ముంబయిలోని నాయర్ ఆసుపత్రిలో రెండోసారి కూడా తన రక్తాన్ని దానం చేసినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. ‘దానికి ధైర్యం, బలం అవసరం! కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేసి అభినందించారు. 

రెండోసారి ప్లాస్మా ఇచ్చిన అనంతరం  జోయా ట్వీట్ చేస్తూ..‘మొదటిసారి దానం చేసిన ప్లాస్మా కారణంగా ఓ వ్యక్తి ఐసీయూ నుంచి కోలుకున్నారు. ‘కొవిడ్ నుంచి కోలుకున్న ప్రతిఒక్కరు వారి రక్తాన్ని దానం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాం, దాని వల్ల ఇతరులకు సాయం చేసిన వారు అవుతారు’ అని వైద్యులు నాకు సూచించారు’ అని ఆమె వెల్లడించారు. 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని