చైనా రెస్టారెంట్లు నిషేధించండి: అఠవాలే

దేశ సరిహద్దుల్లో చైనా దమనకాండకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ దేశ ఆహార ఉత్పత్తులను దేశ ప్రజలంతా బహిష్కరంచాలని......

Updated : 18 Jun 2020 16:12 IST

దిల్లీ: దేశ సరిహద్దుల్లో చైనా దమనకాండకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ దేశ ఆహార ఉత్పత్తులను దేశ ప్రజలంతా బహిష్కరంచాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్‌ అఠవాలే పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా దేశంలోని చైనా హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం విధించాలని సూచించారు. భారత్‌లో చైనా రెస్టారెంట్లు నిర్వహించేవారు వాటిని మూసివేయాలన్నారు. భారత్‌- చైనా సరిహద్దులో గాల్వాన్‌ లోయ వద్ద చెలరేగిన తీవ్ర ఘర్షణలో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతుతూ.. ‘‘ చైనా 20మంది భారత సైనికులను పొట్టనపెట్టుకుంది. భారత్‌ను అవమానించే చర్యలకు దిగింది. చైనా హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం విధించాలని నా సూచన. చైనా రెస్టారెంట్లు నిర్వహించేవారు కూడా వాటిని మూసివేయాలి. ప్రభుత్వం ఆ దిశగా ఆదేశాలివ్వాలి. చైనా ఆహార ఉత్పత్తులను తినేవారు కూడా వాటిని బహిష్కరించాలని నా వినతి’’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని