
హెచ్1బి వీసా ఎఫెక్ట్: తెలుగు వారిపై తక్కువే!
తానా అధ్యక్షుడి స్పందన
ఇంటర్నెట్ డెస్క్: హెచ్1బీ వీసాలపై అమెరికా విధించిన తాజా ఆంక్షలు తెలుగువారిపై కొంతమేరకు మాత్రమే ప్రభావం చూపవచ్చని తానా అధ్యక్షులు జయకుమార్ తాళ్లూరి అన్నారు. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారికి ఎటువంటి సమస్యా లేదని.. కొత్తగా ఈ దేశానికి రావాలనుకుంటున్న వారికి మాత్రం కాస్త కష్టమని తెలిపారు. ఇప్పటికే అమెరికాలో ఉంటూ, వీసా కాలపరిమితి అయిపోయిన వారు.. ఈ దేశంలోనే ఉన్నంత వరకూ ఏ సమస్యా రాదని చెప్పారు. కాగా, వారిని అమెరికా నుంచి బయటకు వెళ్లి వచ్చేందుకు అనుమతించరని తానా అధ్యక్షులు వివరించారు. ఓపీటీ లేదా స్టూడెంట్ వీసాలపై వచ్చిన వారికి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు. తెలుగువారిపై కొంతవరకు ప్రభావం ఉండేమాట నిజమేనని... అయితే అందుకు భయపడాల్సిన అవసరం లేదని జయకుమార్ స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.