మ‌హ‌మ్మారి ముప్పు ఇప్ప‌ట్లో ముగిసిపోదు!

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ఇప్ప‌ట్లో ముగిసిపోద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ స్ప‌ష్టం చేశారు. గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ నెల‌లో చైనాలో బ‌య‌ట‌పడ్డ ఈ మ‌హ‌మ్మారి, ఆరు నెల‌ల్లోపే ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోటి మందికి సోక‌గా, 5ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకుంది.

Updated : 30 Jun 2020 14:08 IST

స‌మ‌గ్ర వ్యూహంతోనే పోరాడాల‌ని దేశాల‌కు పిలుపు..

దిల్లీ: ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ఇప్ప‌ట్లో ముగిసిపోద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ స్ప‌ష్టం చేశారు. గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ నెల‌లో చైనాలో బ‌య‌ట‌పడ్డ ఈ మ‌హ‌మ్మారి, ఆరు నెల‌ల్లోపే ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోటి మందికి సోక‌గా, 5ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకుంది. ఈ వైర‌స్ గురించి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు చైనా తెలియ‌జేసి ఆరు నెల‌లు ముగిసిన నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్ఓ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ విలేక‌రుల‌తో మాట్లాడారు. 

ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తోన్న క‌రోనా వైర‌స్ విస్తృతంగా వ్యాపించేందుకు అనువైన వాతావ‌ర‌ణం ఇంకా ఉంద‌ని.. మ‌రింతమంది ప్ర‌జ‌లు దీని బారిన‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని టెడ్రోస్ అధనామ్ హెచ్చ‌రించారు. 'వైర‌స్ విజృంభ‌ణ ముగియాల‌ని, మ‌న‌జీవితాల‌ను కొన‌సాగించాల‌ని మ‌న‌మంద‌రం కోరుకుంటున్నాం. వైర‌స్ విస్తృత వేగంతో వ్యాపిస్తున్న‌ప్ప‌టికీ కొన్ని దేశాలు వైర‌స్ వ్యాప్తిని నిరోధించ‌డంలో కాస్త పురోగ‌తి సాధించాయి. కానీ, కఠిన‌మైన వాస్తవం ఎంటంటే.. ఈ వైర‌స్ ప్ర‌భావం ఇప్ప‌ట్లో ముగిసే జాడ‌లు క‌నిపించ‌డం లేదు' అని డ‌బ్ల్యూహెచ్ఓ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ స్ప‌ష్టం చేశారు. 

ఈ స‌మయంలో క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు సుర‌క్షిత‌, స‌మ‌ర్థ‌వంత‌మైన‌ వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే ఎంతో కృషి జ‌రుగుతోంది. అయిన‌ప్ప‌టికీ, ఈ ప్ర‌య‌త్నం కూడా విజ‌యవంతం అవుతుంద‌నే గ్యారెంటీ లేద‌ని డ‌బ్ల్యూహెచ్ఓ అత్య‌వ‌స‌ర విభాగాధిప‌తి మైక్ రేయాన్ అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే, ఈ స‌మ‌యంలో వైర‌స్ సోకిన వారిని వెంట‌నే గుర్తించి ఐసోలేట్ చేయ‌డం, వారితో స‌న్నిహితంగా మెలిగిన వారికి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వహించడం వంటి చ‌ర్య‌ల ద్వారా వైర‌స్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చ‌ని మైక్ రేయాన్ సూచించారు. ఈ విధానాన్ని అనుస‌రిస్తూ వైర‌స్ క‌ట్ట‌డికి స‌మ‌గ్ర వ్యూహంతో ముందుకెళ్తున్న జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా, జ‌ర్మ‌నీ దేశాల‌ను మైక్ రేయాన్ ఉద‌హ‌రించారు.

ఇదిలా ఉంటే, వైర‌స్‌పై పోరులో భాగంగా జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌ల్లో పురోగ‌తిని అంచ‌నా వేసేందుకు ఈవారం ఓ స‌మావేశాన్ని ఏర్పాటు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు.

ఇవీ చ‌ద‌వండి..
కొవిడ్ 19: ప‌్ర‌తి 18 సెక‌న్ల‌కు ఓ ప్రాణం!
భార‌త్‌లో 17వేల‌కు చేరువ‌లో క‌రోనా మ‌ర‌ణాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని