'ప్లాస్మా థెర‌పీ'పై కొన‌సాగుతున్న అధ్య‌య‌నం..

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బాధితుల‌ను ర‌క్షించ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో ప్లాస్మా థెర‌పీ విధానం మెరుగైన ఫ‌లితాలు ఇస్తున్న విష‌యం తెల‌సిందే. భార‌త్‌లోనూ ప్లాస్మా థెర‌పీ ద్వారా క‌రోనా రోగుల‌ను ర‌క్షించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. అయితే ప్లాస్మా థెర‌పీపై భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) పూర్తిస్థాయి ప‌రిశోధ‌న‌లు(ప్లాసిడ్ ట్ర‌య‌ల్‌) ఇంకా కొన‌సాగుతున్న‌ట్లు వెల్ల‌డించింది.

Published : 30 Jun 2020 19:40 IST

దిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బాధితుల‌ను ర‌క్షించ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో ప్లాస్మా థెర‌పీ విధానం మెరుగైన ఫ‌లితాలు ఇస్తున్న విష‌యం తెల‌సిందే. భార‌త్‌లోనూ ప్లాస్మా థెర‌పీ ద్వారా క‌రోనా రోగుల‌ను ర‌క్షించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. అయితే ప్లాస్మా థెర‌పీపై భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) పూర్తిస్థాయి ప‌రిశోధ‌న‌లు(ప్లాసిడ్ ట్ర‌య‌ల్‌) ఇంకా కొన‌సాగుతున్న‌ట్లు వెల్ల‌డించింది. మొత్తం‌‌ 452 మంది శాంపిళ్ల‌పై అధ్య‌య‌నం చేస్తున్న‌ట్లు తెలిపింది. వీటిలో దాదాపు 300మంది రోగుల ఫ‌లితాల‌ను విశ్లేషించాల్సి ఉంద‌ని పేర్కొంది. అధ్య‌య‌నం పూర్తైన వెంట‌నే శాస్త్రీయ కోణంలో ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తామ‌ని ఐసీఎంఆర్ తెలిపింది.

కరోనా చికిత్సకు నిర్దిష్ట ప్రమాణాలు లేనందున వైర‌స్ బారిన‌ప‌డి కోలుకున్న వారినుంచి ప్లాస్మా(ఫ్లూయిడ్‌)ను సేకరించి క‌రోనా రోగుల‌కు ఎక్కిస్తారు. తద్వారా వారిలో రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం విషమించిన కరోనా పాజిటివ్‌ బాధితుల్లో ప్లాస్మా థెరపీ మెరుగైన ఫలితాలిస్తున్నట్లు ప్రాథ‌మిక అధ్య‌య‌నంలో తేలింది. దీంతో భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి దేశంలోని వివిధ‌ ఆసుప‌త్రుల్లో ప్లాస్మా థెర‌పీకి అనుమ‌తిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని