భార్యను మేకప్‌ లేకుండా చూసి భర్త షాక్‌.. విడాకులకు దరఖాస్తు

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మేకప్‌ లేకుండా చూసి అవాక్కయ్యాడు 

Updated : 06 Nov 2021 13:03 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మేకప్‌ లేకుండా చూసి అవాక్కయ్యాడు ఓ భర్త. ఇన్నాళ్లు తాను ప్రేమించిన అందగత్తె ఈమేనా అని వాపోయాడు. వివాహమైన మర్నాడే అతనికి ఈ విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఈజిప్టుకు చెందిన ఈ వ్యక్తికి కొద్దిరోజుల క్రితం ఓ అమ్మాయితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. రోజూ చాటింగ్‌ చేసుకుని ఇద్దరూ దగ్గరయ్యారు. ఆమె అందాన్ని ఫొటోల్లో చూసి అతడు మంత్రముగ్ధుడయ్యాడు. ఆమెను నేరుగా కలిసేందుకు తహతహలాడాడు. పలుమార్లు డేటింగ్‌కు కూడా వెళ్లాడు. ఆమెను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన మర్నాడే అమె అసలు అందం చూసి కంగుతిన్నాడు. ‘నిన్నమొన్నటి వరకు నేను చూసింది ఈమెనేనా?’ అనుకున్నాడు. మేకప్‌ లేకుండా తన భార్య అందంగా కనిపిస్తుందేమోనని నెల రోజుల వరకు ఎదురు చూశాడు. ఇక ఫలితం లేకపోవడంతో తనతో కలిసి ఉండలేనని విడాకుల కోసం హెలిపోలిస్‌ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని