
Crime News: పదో తరగతి తెలివితేటలతో ‘డ్రగ్స్’ ల్యాబ్..
ఓ యువకుడు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కాడు. యూట్యూబ్‌లో చూసి, మత్తు పదార్థాలు తయారు చేసేందుకు ఓ మినీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశాడు. కానీ, చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. గుజరాత్‌లోని సూరత్ వరచ్చా ప్రాంతంలో నివసించే జైమన్ సావనీ.. పదో తరగతి పాస్ అయ్యాడు. లాక్డౌన్లో అతడు మత్తుపదార్థాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్ తయారు చేసి, అమ్మాలనుకున్నాడు. దాంతో యూట్యూబ్‌లో చూసి, గుట్టుగా ఓ మినీ ల్యాబ్ ఏర్పాటు చేశాడు. అయితే.. సూరత్ ఎస్ఓజీ అధికారులు అతని ల్యాబ్‌పై దాడులు చేసి అరెస్టు చేశారు. ఈ రాకెట్లో ఇంకా ఎవరెవరి హస్తం ఉంది? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.