రెండు సంస్థల్లో సీబీడీటీ సోదాలు.. రూ.300 కోట్ల అక్రమ ఆదాయం వెలుగులోకి

రాజస్థాన్‌కు చెందిన రెండు సంస్థల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.300 కోట్ల మేర లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు

Published : 29 Dec 2021 11:03 IST

దిల్లీ: రాజస్థాన్‌కు చెందిన రెండు సంస్థల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.300 కోట్ల మేర లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం ప్రకటించింది. ఈ నెల 22న జైపుర్, ముంబయి, హరిద్వార్‌లలోని ఆ సంస్థలకు చెందిన 50 ప్రాంగణాల్లో సోదాలు చేపట్టినట్లు తెలిపింది. ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు తయారు చేసే సంస్థలో రూ.150 కోట్ల మేర అక్రమ ఆదాయానికి సంబంధించిన ఆధారాలు దొరికినట్లు పేర్కొంది. ఆ సంస్థ వ్యాపార లావాదేవీలను పద్దు పుస్తకాల్లో నమోదు చేయకపోవడంతోపాటు, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించి చూపడానికి నకిలీ వ్యయాలను సృష్టించిందని వెల్లడించింది. సంస్థ ప్రతినిధులు రూ.55 కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపనట్లు అంగీకరించారని, దానిపై పన్ను చెల్లిస్తామని చెప్పారని పేర్కొంది. రుణాలు ఇచ్చే మరో సంస్థలోనూ రూ.150 కోట్ల అక్రమ ఆదాయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది. రుణాలను నగదు రూపంలో ఇవ్వడంతోపాటు అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని, అలా వచ్చిన ఆదాయాన్ని లెక్కల్లో చూపడం లేదని పేర్కొంది. రెండు సంస్థల నుంచి రూ.17 కోట్ల విలువ చేసే నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని