Modi: కాశీ విశ్వనాథుడి సేవకులకు ప్రత్యేక పాదరక్షలు పంపిన మోదీ

కాశీ విశ్వనాథ ఆలయంలో పనిచేస్తున్నవారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అభిమానాన్ని చాటుకున్నారు.

Updated : 11 Jan 2022 15:58 IST

దిల్లీ: కాశీ విశ్వనాథ ఆలయంలో పనిచేస్తున్నవారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అభిమానాన్ని చాటుకున్నారు. జనపనారతో తయారుచేసిన 100 జతల ప్రత్యేక పాదరక్షలను వారి కోసం పంపించారు. రబ్బరు, తోలుతో తయారుచేసిన పాదరక్షలను కాశీ విశ్వనాథ ధామం ప్రాంగణంలో వినియోగించడం నిషేధం. దీంతో.. పూజారులు, సేవల్లో పాల్గొనేవారు, సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికుల వంటివారిలో ఎక్కువ మంది అక్కడ పాదరక్షలు లేకుండానే విధులు నిర్వర్తిస్తుంటారు. శీతల వాతావరణంలో వారు అలా ఇబ్బంది పడటం ప్రధాని దృష్టికి రావడంతో.. జనపనారతో తయారుచేసిన పాదరక్షలను వారి కోసం పంపించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని