జీతంతో సర్కారు బడికి కొత్త హంగులు

విద్యార్థుల చదువు కోసం తన జీతాన్ని వ్యయం చేస్తూ పాఠశాలలో ఉన్నత సౌకర్యాలు సమకూరుస్తున్నారు ఓ ప్రధానోపాధ్యాయుడు.

Published : 20 Mar 2023 04:10 IST

విద్యార్థుల చదువు కోసం తన జీతాన్ని వ్యయం చేస్తూ పాఠశాలలో ఉన్నత సౌకర్యాలు సమకూరుస్తున్నారు ఓ ప్రధానోపాధ్యాయుడు. ఒకప్పుడు ప్రైవేట్‌ స్కూళ్ల బాట పట్టిన చిన్నారులను ప్రభుత్వ బడిలో చేరేలా కృషి చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్‌ జిల్లా చిఖ్‌లాడీ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో కృపా శంకర్‌ 2012 నుంచి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలోని విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి కనబర్చడం లేదని గ్రహించిన ఆయన.. వారిలో మార్పు తేవాలని భావించారు. ముందుగా పిల్లలను స్కూల్‌కు ఆకర్షితులయ్యేలా చేయాలనుకున్నారు. వెంటనే పాఠశాల రూపురేఖలు మార్చే పనిలో పడ్డారు. కృపా శంకర్‌ ఒకరోజు వేతనం రూ.3 వేలు. ఏడాదికి పన్నెండు రోజుల వేతనాన్ని స్కూల్‌ కోసం వెచ్చిస్తున్నారాయన. ఆ డబ్బుతో స్కూల్‌లో సుందరీకరణ పనులు చేపట్టారు. ప్రత్యేకమైన మెటీరియల్‌ను రూపొందించుకొని విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. చిన్న చిన్న బంతులను ఉపయోగించి లెక్కలు నేర్పిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడి కృషిని గ్రామస్థులు కూడా గుర్తించారు. గతంలో ప్రైవేటు స్కూల్‌కు పంపుతున్న తమ చిన్నారులను.. ఆ బడి మాన్పించి ఇక్కడికి పంపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని