ఎవరు?.. ఏమన్నారు..?
సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, ఇతర రెజ్లర్లతో దిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా.
ఛాంపియన్లతో అలాగా వ్యవహరించేది?
సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, ఇతర రెజ్లర్లతో దిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా. మన దేశ ఛాంపియన్లతో అలా వ్యవహరించడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యమనేది సహనంలో ఉంటుంది. నిరంకుశ శక్తులు అసహనంతో రగులుతుంటాయి. అసమ్మతి గళాన్ని అణచివేస్తాయి. రెజ్లర్లకు నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా.
మమతా బెనర్జీ
ఇదీ నయా భారత్!
కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి లేరు. ప్రతిపక్షాలూ లేవు. సాధువులు, మఠాధిపతులే ఉన్నారు. తాను ఎలాంటి నయా భారత్‌ను కోరుకుంటున్నారో మోదీ దీనిద్వారా చాటిచెప్పినట్లయింది. ప్రభుత్వంలో మతం చొరబడటాన్ని రాజ్యాంగం అనుమతించదు. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరేలా ఉన్నాయి!
ప్రశాంత్ భూషణ్
ప్రజాస్వామ్య దేవాలయం శక్తి మరింత పెరుగుతుంది
అశోకుడి ధర్మచక్రం, చోళుల సెంగోల్ వంటి చిహ్నాలు ఉండటం వల్ల ప్రజాస్వామ్య దేవాలయం (కొత్త పార్లమెంటు భవనం) శక్తి మరింత పెరుగుతుంది. వేర్వేరు రాష్ట్రాల నుంచి సేకరించిన మెటీరియల్‌ను నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి వినియోగించారు. ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్’కు అది నిజమైన ప్రతీక.
తేజస్వీ సూర్య
అవగాహన కల్పిద్దాం
రుతుస్రావ సంబంధిత ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో పాటు కొన్ని అపోహల వల్ల మహిళల సంక్షేమంపై, వారి విద్యావకాశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ విషయంలో అవగాహన పెంచేందుకు మనమంతా ప్రతినబూనుదాం. మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు నిధుల కేటాయింపు పెరిగేలా చూద్దాం.
కాంగ్రెస్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో 30 టన్నుల వ్యర్థాల తొలగింపు..!
-
KTR: కర్ణాటకలో కాంగ్రెస్ ‘రాజకీయ ఎన్నికల పన్ను’: మంత్రి కేటీఆర్
-
Rohit Shama: సిక్సర్లందు రోహిత్ సిక్సర్లు వేరయా!
-
World Culture Festival : ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం ఎంతో ముఖ్యం : జైశంకర్
-
Nara Lokesh: 2 రోజులుకే ఆ పాల ప్యాకెట్లు గ్యాస్ బాంబుల్లా పేలుతున్నాయ్: నారా లోకేశ్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు