Chandrayaan 3: చంద్రయాన్‌కు నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

చంద్రయాన్‌-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమై 24 గంటలు కొనసాగనుంది.

Updated : 13 Jul 2023 07:02 IST

షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: చంద్రయాన్‌-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమై 24 గంటలు కొనసాగనుంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌.. వాహకనౌకను పరిశీలించారు. అనంతరం భాస్కరా అతిథి భవనానికి చేరుకుని శాస్త్రవేత్తలతో సమీక్షించారు. చంద్రయాన్‌-3 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌ వీరముత్తువేల్‌, ఎల్‌వీఎం-3పీ4 మిషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.మోహన్‌కుమార్‌, అసోసియేట్‌ మిషన్‌ డైరెక్టర్‌ నారాయణన్‌, వెహికల్‌ డైరెక్టర్‌ బిజూస్‌ థామస్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని