భోజ్‌శాలలో కొనసాగిన సరస్వతి పూజలు

మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌శాల ప్రాంగణంలో మంగళవారం హిందువులు సరస్వతి దేవికి పూజలు నిర్వహించారు.

Published : 27 Mar 2024 04:22 IST

ఏఎస్‌ఐ సర్వేతో పరిష్కారం లభిస్తుంది
భోజ్‌ ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడి వ్యాఖ్య

ధార్‌: మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌శాల ప్రాంగణంలో మంగళవారం హిందువులు సరస్వతి దేవికి పూజలు నిర్వహించారు. ఆరువారాల్లోగా భోజ్‌శాలలో ‘శాస్త్రీయ సర్వే’ను నిర్వహించాలంటూ ఈ నెల 11న మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు భారత పురావస్తు విభాగం ఈ నెల 22 నుంచి (ఏఎస్‌ఐ) సర్వే కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం సర్వే పనులు మొదలు కాకుండానే పలువురు భక్తులు భోజ్‌శాలకు చేరుకుని అమ్మవారికి పూజలు చేశారు. ఏఎస్‌ఐ సర్వేతో ఈ ప్రదేశ వివాదానికి ఉత్తమ పరిష్కారం లభిస్తుందని భోజ్‌ ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు బల్వీర్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యయుగం నాటి స్మారక కట్టడమైన భోజ్‌శాలను హిందువులు వాగ్దేవి (సరస్వతి) ఆలయం అని నమ్ముతారు. ముస్లింలు కమల్‌ మౌలా మసీదు అని విశ్వసిస్తారు. ఇక్కడ మంగళవారం హిందువుల పూజలకు, శుక్రవారం ముస్లింల ప్రార్థనలకు 2003 ఏప్రిల్‌ 7 నుంచి ఏఎస్‌ఐ అనుమతించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని