icon icon icon
icon icon icon

కోటీశ్వరులతో ఢీ.. స్వతంత్ర అభ్యర్థిగా నిరుపేద మహిళ

ఎన్నికలంటే మామూలు విషయం కాదు. అర్థబలం, అంగబలం ఉండి తీరాల్సిందే. అవేమీ లేకున్నా ఓ మహిళా మణి సాహసం చేశారు.

Published : 28 Apr 2024 08:15 IST

ఎన్నికలంటే మామూలు విషయం కాదు. అర్థబలం, అంగబలం ఉండి తీరాల్సిందే. అవేమీ లేకున్నా ఓ మహిళా మణి సాహసం చేశారు. తన బ్యాంకు ఖాతాలో రూ.రెండు వేలే ఉన్నా.. సార్వత్రిక ఎన్నికల బరిలో దిగారు. ఆమె పేరు శాంతిబాయి మారావీ. వయసు 33 ఏళ్లు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా స్థానం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

చదివింది అయిదో తరగతే

కోర్బాలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా జ్యోత్స్నా మహంత్‌, భాజపా తరఫున సరోజ్‌ పాండే పోటీ చేస్తున్నారు. వీరిద్దరికీ రూ.కోట్ల విలువైన ఆస్తులున్నాయి. శాంతిబాయి మాత్రం నిరుపేద. ఆమెకు రెండు బ్యాంకు ఖాతాలున్నాయి. వాటిలో ఓ ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేదు. మరో ఖాతాలో రూ.2 వేలు ఉన్నాయి. చేతిలో కేవలం రూ.20 వేల నగదు ఉంది. దానికితోడు 10 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి ఉంది. ఆమెకు కనీసం పాన్‌కార్డు లేదు. ఏ సామాజిక మాధ్యమంలోనూ ఖాతా లేదు. శాంతిబాయి చదివింది అయిదో తరగతే. ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కూలిపనులు, వ్యవసాయమే శాంతిబాయి కుటుంబానికి జీవనాధారాలు. నామినేషన్‌ దాఖలు చేసి వచ్చినప్పటి నుంచీ శాంతిబాయి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యే ఉండటం కొసమెరుపు!

ఈటీవీ భారత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img

నియోజకవర్గ సమాచారం