icon icon icon
icon icon icon

రాహుల్‌ సలహాదారు భారత విభజన గురించి మాట్లాడుతున్నారు

ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ శాం పిట్రోడా చేసిన ‘వివాదాస్పద’ వ్యాఖ్యలను భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ఖండించారు.

Published : 10 May 2024 06:03 IST

పిట్రోడాపై నడ్డా మండిపాటు

చిత్రకూట్‌/ ఫతేపుర్‌: ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ శాం పిట్రోడా చేసిన ‘వివాదాస్పద’ వ్యాఖ్యలను భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ఖండించారు. చర్మవర్ణం ఆధారంగా భారత్‌ను విభజించడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సంబంధించిన ఒక సలహాదారు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అలాంటివారు దేశ సంస్కృతితో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో రాముడి భక్తులపై తూటాలు పేల్చారని, ఇప్పుడు వారిపై పూలు చల్లుతున్నారని వ్యాఖ్యానించారు. గురువారం యూపీలోని చిత్రకూట్‌, ఫతేపుర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో నడ్డా ప్రసంగించారు. భారత్‌లో వివిధ ప్రాంతాలవారి రూపురేఖలను చైనా, ఆఫ్రికా, అరబ్‌, శ్వేతజాతీయులతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి ఆయన సలహాదారుగా వ్యవహరించారు. రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడు. ‘‘రాహుల్‌ ఈ మధ్య రాజ్యాంగ ప్రతిని వెంట ఉంచుకుంటున్నారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా దళితులు, గిరిజనులు, బీసీల హక్కులను కాంగ్రెస్‌ హరించాలనుకుంటోంది’’ అని నడ్డా విమర్శించారు. విపక్ష ‘ఇండియా’ కూటమిని ఆయన అహంకార కూటమిగా అభివర్ణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img