icon icon icon
icon icon icon

Arvind Kejriwal: ఇది ప్రజాస్వామ్య విజయం: సునీత కేజ్రీవాల్‌

కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్‌, ఆప్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Updated : 10 May 2024 20:01 IST

దిల్లీ: మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత  కేజ్రీవాల్‌ సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించారు.  ప్రజల ప్రార్థనలు, ఆశీర్వాదాల ఫలితంగా ప్రజాస్వామ్యం విజయం సాధించిందని ఆమె ఆనందం వ్యక్తంచేశారు. దీనిపై సునీత ఎక్స్‌లో పోస్టు చేశారు. 

‘‘హనుమాన్ జీకి జై. ఇది లక్షలాది ప్రజల ప్రార్థనలు, ఆశీర్వాదాల ఫలితం. ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు. కేజ్రీవాల్‌ తిహాడ్‌ జైలు నుంచి బయటకు రాగానే ఆయనకు ఆహ్వానం పలికేందుకు సునీత అక్కడికి చేరుకున్నారు. ఇటీవల ఆప్‌ నేతలు మాట్లాడుతూ మధ్యంతర బెయిల్‌ హనుమంతుడు అతడి భక్తుడికి ఇచ్చిన ఆశీర్వాదమని పేర్కొన్నారు. 

40 రోజుల నిరీక్షణ అనంతరం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ రావడం అద్భుతమైన విషయమని దిల్లీ మంత్రి, ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారనున్నాయని దైవం ఈవిధంగా సూచిస్తుందన్నారు. ఆయన విడుదల దేశంలో పెనుమార్పులకు మార్గాన్ని సుగమం చేస్తుందని దీమా వ్యక్తంచేశారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్సింగ్ కేజ్రీవాల్‌కు బెయిల్‌ కోర్టు బెయిల్‌ ఇవ్వడంపై హర్షం వ్యక్తంచేశారు. సత్యాన్ని ఎప్పటికీ  ఓడించలేమని పేర్కొన్నారు.  సుప్రీంకోర్టు తీర్పుతో నియంతృత్వం అంతమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img