icon icon icon
icon icon icon

Lok Sabha Elections: నామినేషన్ వేసేందుకు పరుగులు పెట్టిన నేత.. ఎందుకంటే..?

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడుతోన్న ఓ అభ్యర్థి పరుగులు పెట్టి మరీ నామినేషన్‌ వేయాల్సి వచ్చింది.

Published : 10 May 2024 16:55 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గడువు ముగియకముందే నామినేషన్ వేసేందుకు ఓ అభ్యర్థి పరుగులు పెట్టిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?(Lok Sabha Elections)

ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవరియా ప్రాంతం నుంచి శశాంక్‌ మణి త్రిపాఠిని భాజపా బరిలోకి దింపింది. ఆయన గురువారం చివరి నిమిషంలో నామినేషన్ వేశారు. దానికి ముందు తన కోసం ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమానికి హాజరుకావడం ఆలస్యానికి కారణమైంది. నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఉదయం 11 గంటలకు మొదలై.. మధ్యాహ్నం మూడు గంటలతో ముగుస్తుంది. ఆ గడువుకు 15 నిమిషాలే ఉండటంతో త్రిపాఠి 100 మీటర్ల దూరం పరిగెత్తుకుంటూ వెళ్లారు. అప్పుడు ఆయన వెంట పలువురు భాజపా నేతలు ఉన్నారు. వారు కూడా ఆయన వెంట పరుగుతీసి, రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సుప్రీం

నామినేషన్ వేసిన తర్వాత ఆలస్యానికి గల కారణంపై మీడియా ప్రశ్నించింది. ‘‘సమావేశం తర్వాత రిటర్నింగ్ కేంద్రానికి వస్తోన్న దారిలో తాను మద్దతుదారుల్ని కలవాల్సి వచ్చింది. కాలేజీ రోజుల్లో రన్నింగ్ అలవాటే. దానినే ఇప్పుడు ఉపయోగించాను’’ అని చెప్పారు. 54 ఏళ్ల త్రిపాఠి ఎన్నికల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే ఆయన కుటుంబంలో చట్టసభలకు ఎన్నికైనవారున్నారు. ఆయన తండ్రి ప్రకాశ్‌ మణి త్రిపాఠి..1996లో దేవరియా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన తాత నరైన్ మణి త్రిపాఠి ఒక ఐఏఎస్‌ అధికారి. ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహించారు. దేవరియా స్థానానికి ఏడో విడతలో ఓటింగ్ జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img