icon icon icon
icon icon icon

లోక్‌సభ ఎన్నికలపై మోదీ, రాహుల్‌ డిబేట్‌!

లోక్‌సభ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీల నడుమ బహిరంగ చర్చ జరగాలని ‘ది హిందూ’ పత్రిక మాజీ ఎడిటర్‌ ఎన్‌.రామ్‌, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, దిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్‌ ఎ.పి.షా అభిప్రాయపడ్డారు.

Published : 10 May 2024 05:59 IST

మాజీ ఎడిటర్‌, రిటైర్డ్‌ జడ్జీల ఆకాంక్ష

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీల నడుమ బహిరంగ చర్చ జరగాలని ‘ది హిందూ’ పత్రిక మాజీ ఎడిటర్‌ ఎన్‌.రామ్‌, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, దిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్‌ ఎ.పి.షా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మోదీ, రాహుల్‌లకు వీరు లేఖ రాశారు. వాణిజ్య ప్రయోజనాలకు దూరంగా, పక్షపాత రహితమైన వేదిక మీద ఈ చర్చ జరగాలని కోరారు. ఇలాంటి చర్చ ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా.. ఆరోగ్యకరమైన, శక్తిమంతమైన ప్రజాస్వామ్య వాస్తవ చిత్రాన్ని ఆవిష్కరిస్తుందన్నారు. ఒకవేళ ఈ ఇద్దరు నేతలకు బహిరంగ చర్చలో పాల్గొనేందుకు వీలుపడకపోతే తమ తరఫున ప్రతినిధులను పంపాలని లేఖలో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img