Edible Oil Prices: దేశంలో తగ్గనున్న వంటనూనె ధరలు

పండుగ వేళ.. వంట నూనె ధరలను నియంత్రించేందుకు కేంద్రం సుంకాలను తగ్గించింది. ఈ మేరకు బుధవారం రెండు ఉత్తర్వులను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) విడుదల చేసింది. ఇందులో ముడి

Published : 14 Oct 2021 06:56 IST

దిల్లీ: పండుగ వేళ.. వంట నూనె ధరలను నియంత్రించేందుకు కేంద్రం సుంకాలను తగ్గించింది. ఈ మేరకు బుధవారం రెండు ఉత్తర్వులను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) విడుదల చేసింది. ఇందులో ముడి పామాయిల్‌, పొద్దుతిరుగుడు, సోయాబీన్‌ నూనెలపైౖ బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వ్యవసాయ సెస్‌లోనూ కోత విధించింది. దీంతో ముడి నూనె ధరలు.. లీటర్‌కు రూ.12 నుంచి రూ.15వరకు తగ్గే అవకాశం ఉంది. శుద్ధిచేసిన పొద్దుతిరుగుడు, సోయాబీన్‌, పామోలిన్‌, పామాయిల్‌పై కూడా బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని 32.5% నుంచి 17.5 శాతానికి పరిమితం చేసింది. దీంతో వీటి చిల్లర ధరలు   లీటర్‌కు రూ.8 నుంచి 9 వరకు తగ్గనున్నాయి.

గురువారం నుంచి అమల్లోకి రానున్న ఈ ఉత్తర్వులు.. వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. గత కొన్ని నెలలుగా దేశీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. వీటిని నియంత్రించేందుకు ఇప్పటివరకు కేంద్రం మూడు సార్లు సుంకాలు తగ్గించింది. ఇది నాలుగో ప్రయత్నమని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని