
Updated : 11 Dec 2021 11:12 IST
Jayalalithaa: జయలలిత బంగ్లా తాళాలు దీప చేతికి
విల్లివాక్కం, న్యూస్‌టుడే: మద్రాసు హైకోర్టు ఉత్తర్వుల మేరకు చెన్నై పోయెస్ గార్డెన్‌లోని మాజీ సీఎం జయలలిత బంగ్లా వేద నిలయం తాళాలు ఆమె అన్న కుమార్తె దీప చేతికి చెన్నై జిల్లా కలెక్టరు విజయరాణి శుక్రవారం అందజేశారు. ఇంతకు ముందు అన్నాడీఎంకే ప్రభుత్వం జయలలిత పోయెస్ గార్డెన్ బంగ్లాని ప్రభుత్వ పరం చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ జయలలిత అన్న కుమారుడు, కుమార్తెలైన దీపక్,దీపలు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు జయలలిత బంగ్లాని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కుదరదని, మెరీనా బీచ్‌లో ఓ స్మారక మందిరం ఉండగా మరొకటి ఎందుకని ప్రశ్నించింది.
Tags :