
గాల్లోకి నోట్ల కట్టలు, ఆస్తి దస్తావేజులు..!
మధ్యప్రదేశ్ రైల్వే ప్లాట్‌ఫామ్‌పై యాచకుడి వింత ప్రవర్తన
ఉజ్జయిని: మధ్యప్రదేశ్ నాగ్దా రైల్వే స్టేషన్‌లో ఓ యాచకుడు విచిత్రంగా ప్రవర్తించాడు. రూ.100, రూ.50, రూ.10 నోట్లకట్లను రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై వెదజల్లాడు. ఇది చూసి ఆశ్చర్యపోవడం ప్రయాణికుల వంతు అయింది. నోట్లతో పాటు ఆస్తి దస్తావేజులు కూడా ప్లాట్‌ఫామ్‌పై పడి ఉండటం గమనార్హం. అయితే ఆ నోట్లను ఎవరూ ముట్టుకోలేదు. ఆ వృద్ధుడు ఎందుకు అలా చేశాడో తెలియలేదు. ఎవరో అన్న మాటలకు కోపంతో అతని వద్ద ఉన్న డబ్బులను విసిరేశాడని ఓ ప్రయాణికుడు చెప్పాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.