నెలాఖరుకల్లా గరిష్ఠస్థాయికి మూడో ఉద్ధృతి

దేశంలో కొవిడ్‌ మహమ్మారి మూడో దశ విజృంభణ ఈ నెల చివరి నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ఐఐటీ కాన్పుర్‌ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ అంచనా వేశారు. రోజువారీ కేసులు మునుపెన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో నమోదవుతాయని పేర్కొన్నారు. ‘‘ప్రాథమిక అంచనాల ప్రకారం దేశీయంగా కరోనా

Published : 11 Jan 2022 05:11 IST

ఐఐటీ కాన్పుర్‌ ప్రొఫెసర్‌  మనీంద్ర అగర్వాల్‌ అంచనా

దేశంలో కొవిడ్‌ మహమ్మారి మూడో దశ విజృంభణ ఈ నెల చివరి నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ఐఐటీ కాన్పుర్‌ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ అంచనా వేశారు. రోజువారీ కేసులు మునుపెన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో నమోదవుతాయని పేర్కొన్నారు. ‘‘ప్రాథమిక అంచనాల ప్రకారం దేశీయంగా కరోనా మూడో ఉద్ధృతి ఈ నెలాఖరులో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. రెండో ఉద్ధృతితో పోలిస్తే ఈ దఫా బాధితుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే- ఏ స్థాయిలో కేసులు పెరుగుతాయో.. తర్వాత అదే స్థాయిలో తగ్గుముఖం పడతాయి. మార్చి మూడో వారంలో మూడో ఉద్ధృతి ముగుస్తుంది’’ అని మనీంద్ర చెప్పారు. దేశ రాజధాని దిల్లీలో త్వరలోనే రోజుకు 40 వేల వరకు కొత్త కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. ముంబయి, కోల్‌కతా వంటి నగరాల్లోనూ ఈ నెల మధ్యలో కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని ఆయన అంచనా వేశారు. ఈ నగరాల్లో మూడో ఉద్ధృతి ఈ నెలాఖరుతోనే ముగిసే అవకాశం ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని