Covid Vaccine: బహిరంగ విపణిలోకి కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌

కొన్ని షరతులకు లోబడి కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలను బహిరంగ విపణిలోకి అనుమతించేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ బుధవారం సిఫార్సు

Updated : 20 Jan 2022 06:58 IST

దిల్లీ: కొన్ని షరతులకు లోబడి కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలను బహిరంగ విపణిలోకి అనుమతించేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ బుధవారం సిఫార్సు చేసింది. మన దేశంలో అభివృద్ధిపరిచిన ఈ రెండు కొవిడ్‌ టీకాలకు ఇప్పటి వరకు అత్యవసర వినియోగ అనుమతి మాత్రమే ఉంది. తమ టీకాలను బహిరంగ విపణిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనుమతించాల్సిందిగా కొవిషీల్డ్‌ తయారీదారైన సీఐఐ, కొవాగ్జిన్‌ను అభివృద్ధిపరిచిన భారత్‌ బయోటెక్‌ సంస్థలు విడివిడిగా డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ రెండు సంస్థల నుంచి అందిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన అనంతరం సీడీఎస్‌సీఓకు చెందిన నిపుణుల కమిటీ బుధవారం సమావేశమై కొన్ని షరతులకు లోబడి రెండు టీకాలకు బహిరంగ విపణి అనుమతులను జారీ చేయవచ్చని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తుది ఆమోదం కోసం ఈ సిఫార్సులను డీసీజీఐకి పంపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని