జాతీయ జెండా కోసం ప్రత్యేక వస్త్రం

జాతీయ పతాకాల కోసం భారత్‌లోని భిన్న వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు సరిపోయే అనేక అధునాతన వస్త్రాలను దిల్లీలోని ఐఐటీకి సంబంధించిన ఒక అంకుర పరిశ్రమ అభివృద్ధి చేస్తోంది. జెండా

Published : 26 Jan 2022 05:02 IST

అభివృద్ధి చేస్తున్న దిల్లీ ఐఐటీ

దిల్లీ: జాతీయ పతాకాల కోసం భారత్‌లోని భిన్న వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు సరిపోయే అనేక అధునాతన వస్త్రాలను దిల్లీలోని ఐఐటీకి సంబంధించిన ఒక అంకుర పరిశ్రమ అభివృద్ధి చేస్తోంది. జెండా కోసం ఉపయోగించే వస్త్ర మన్నికను 100 శాతం మేర మెరుగుపరచింది.

ఈ అంకుర సంస్థ పేరు స్వాత్రిక్‌. జెండా కోసం నాణ్యమైన వస్త్రాన్ని తయారుచేసేందుకు ‘ఫ్లాగ్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’తో చేతులు కలిపింది. ఈ వస్త్రంతో రూపొందించిన జాతీయ జెండాలను ఇప్పటికే దిల్లీ, లద్దాఖ్‌లలో ఏర్పాటు చేశారు. ఎక్కువ బరువు లేకుండానే తీవ్ర వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఎక్కువ కాలం మన్నేలా వీటిని రూపొందించినట్లు ఐఐటీ పరిశోధకులు తెలిపారు. వచ్చే నెలలో 10 భిన్న రకాలను దేశంలోని పలు ప్రాంతాలకు పంపనున్నట్లు చెప్పారు. ఇవి ఎంత కాలం మన్నుతాయన్నది త్వరలో తెలుస్తుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని