
రూ. 263 కోట్ల ‘రిఫండ్స్’ మోసం!
ఐటీ శాఖ ఫిర్యాదుతో ఇన్‌స్పెక్టర్ సహా పలువురిపై సీబీఐ కేసు
దిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) రిఫండ్స్ వ్యవహారంలో రూ. 263 కోట్ల మేర మోసానికి పాల్పడిన ఆరోపణలతో ఓ వ్యాపారవేత్త, ఐటీ ఇన్‌స్పెక్టర్ సహా పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈమేరకు భూషణ్ అనంత్ పాటిల్ అనే వ్యక్తి తమ ఇన్‌స్పెక్టర్ తానాజీ మండల్ అధికారితో కలిసి మోసానికి పాల్పడినట్లు ఐటీ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇతరులతో కలిసి అక్రమ మార్గంలో భారీ మొత్తాన్ని దారి మళ్లించినట్లు ఐటీ శాఖ ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఈ కేసులో ముంబయిలోని కొన్ని కంపెనీలకు చెందిన మరికొందరిపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి దిల్లీ, ముంబయి, లఖ్‌నవూ ప్రాంతాల్లోని 9 చోట్ల ఇటీవల సీబీఐ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.