మజీఠియాను 31 వరకు అరెస్టు చేయవద్దు

శిరోమణి అకాలీదళ్‌ నాయకుడు బిక్రంసింగ్‌ మజీఠియాను ఈ నెల 31 వరకు అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు గురువారం పంజాబ్‌ ప్రభుత్వాన్ని మౌఖికంగా ఆదేశించింది. మాదక ద్రవ్యాల కేసులో ముందస్తు బెయిల్‌ కోసం మజీఠియా దాఖలు చేసిన పిటిషన్‌పై ఆ రోజు

Published : 28 Jan 2022 07:03 IST

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం ఆదేశం

దిల్లీ: శిరోమణి అకాలీదళ్‌ నాయకుడు బిక్రంసింగ్‌ మజీఠియాను ఈ నెల 31 వరకు అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు గురువారం పంజాబ్‌ ప్రభుత్వాన్ని మౌఖికంగా ఆదేశించింది. మాదక ద్రవ్యాల కేసులో ముందస్తు బెయిల్‌ కోసం మజీఠియా దాఖలు చేసిన పిటిషన్‌పై ఆ రోజు తాము వాదనలు ఆలకించనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లిల ధర్మాసనం ప్రకటించింది. నిందితుడు రాజకీయ ప్రతీకార చర్యల్ని ఎదుర్కొంటున్నందువల్ల ముందస్తు బెయిల్‌ అభ్యర్థనపై అత్యవసరంగా విచారణ జరపాలని మజీఠియా తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ కోరారు. ఇదంతా ఎన్నికల జ్వరమని ఆయన అన్నారు. ‘ఇది ఎన్నికల జ్వరమా? ఎన్నికల వైరస్సా? అందరూ సుప్రీంకోర్టుకు వస్తున్నారు..’ అని ధర్మాసనం ప్రశ్నించింది. నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఇప్పుడు న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టుకు వచ్చారని పంజాబ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పి.చిదంబరం చెప్పారు. ‘‘చిదంబరం గారూ! ఇది సముచితమేనా? నిందితుడి పిటిషన్‌ లిస్టింగ్‌ అవుతోందని మీకు తెలుసు. ఎలాంటి నిర్బంధ చర్యలు చేపట్టవద్దని మీ ప్రభుత్వానికి చెప్పండి’’ అని జస్టిస్‌ రమణ అన్నారు.

నితేష్‌ రాణె లొంగిపోయి బెయిల్‌ కోరాలి

హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న మహారాష్ట్ర భాజపా ఎమ్మెల్యే నితేష్‌ రాణె ముందుగా న్యాయస్థానంలో లొంగిపోయి, బెయిల్‌ కోరాలని మరో కేసులో సీజేఐ ధర్మాసనం తెలిపింది. 10 రోజుల వరకు నిందితుడిని అరెస్టు చేయవద్దని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాణె ఈ వ్యవధిలోగా దిగువ కోర్టులో లొంగిపోవాలని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని