‘హిజాబ్‌’ మధ్యంతర అర్జీలపై కర్ణాటక హైకోర్టు అసహనం

హిజాబ్‌ వివాదంపై అర్జీదారుల వాదనలను కర్ణాటక హైకోర్టు సుదీర్ఘంగా వింటోంది. రిట్‌ పిటిషన్లకంటే మధ్యంతర అర్జీలు ఎక్కువగా దాఖలవటంపై అసహనం వ్యక్తం చేసింది. మధ్యంతర అర్జీల ప్రాధాన్యాన్ని అర్థం

Published : 18 Feb 2022 04:50 IST

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: హిజాబ్‌ వివాదంపై అర్జీదారుల వాదనలను కర్ణాటక హైకోర్టు సుదీర్ఘంగా వింటోంది. రిట్‌ పిటిషన్లకంటే మధ్యంతర అర్జీలు ఎక్కువగా దాఖలవటంపై అసహనం వ్యక్తం చేసింది. మధ్యంతర అర్జీల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవటంలో కొందరు విఫలమైనట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి పేర్కొన్నారు. గురువారంనాటికి 8 రిట్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదే సమయంలో 20 మధ్యంతర పిటిషన్లు రావడం, కొన్ని అర్జీలు కోర్టు నిబంధనలను పాటించకపోవటంపై ప్రధాన న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. మీ వాదన అనివార్యత ఏమిటని ఒక న్యాయవాది రహంతుల్లా కొత్వాల్‌ను ప్రశ్నించారు. అంతర్జాతీయ ఒప్పందాలను కోర్టు దృష్టికి తీసుకురావటమే తమ లక్ష్యమని ఆ న్యాయవాది బదులిచ్చారు. ‘మీ అవసరం ప్రస్తుతం మాకు లేదు.. ప్రజాప్రయోజనాల వ్యాజ్యం నిబంధనలు పాటించని మీ అర్జీని తిరస్కరిస్తున్నామ’ని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. విద్యార్థుల తరఫు వాదనలు గురువారం ముగిశాయి. ఇకపై ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని