రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఆనాడే ఆమె వద్దనుకున్నారు!

దేశ అత్యున్నత పీఠమైన రాష్ట్రపతి పదవిని చేపట్టే అవకాశం లభిస్తుందంటే సాధారణంగా ఎవరైనా ఆనందంతో అంగీకరిస్తారు. కానీ రుక్మిణీ దేవి అరండల్‌ మాత్రం ఆనాడే ఇలాంటి ప్రతిపాదనను తిరస్కరించారు. దేశ తొలి మహిళా రాష్ట్రపతిగా మహారాష్ట్రకు చెందిన ప్రతిభా పాటిల్‌ చరిత్రలో

Updated : 04 Jul 2022 07:34 IST

దేశ అత్యున్నత పీఠమైన రాష్ట్రపతి పదవిని చేపట్టే అవకాశం లభిస్తుందంటే సాధారణంగా ఎవరైనా ఆనందంతో అంగీకరిస్తారు. కానీ రుక్మిణీ దేవి అరండల్‌ మాత్రం ఆనాడే ఇలాంటి ప్రతిపాదనను తిరస్కరించారు. దేశ తొలి మహిళా రాష్ట్రపతిగా మహారాష్ట్రకు చెందిన ప్రతిభా పాటిల్‌ చరిత్రలో నిలిచిపోయిన సంగతి మనందరికీ తెలుసు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న వేళ.. మరో మహిళ ద్రౌపదీ ముర్ము కూడా బరిలో కీలకంగా ఉన్నారు. అయితే 1977లోనే ఓ మహిళను ప్రథమ పౌరురాలిగా ఎన్నుకోవడానికి ప్రయత్నం జరిగింది. నాటి జనతా ప్రభుత్వ హయాంలో ప్రధాని మొరార్జీ దేశాయ్‌ ఈ  దిశగా ఆలోచన చేశారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ నాట్య కళాకారిణి రుక్మిణీ దేవి అరండల్‌ను జనతా పార్టీ తరఫున అభ్యర్థిగా ఎంపిక చేయాలని ఆయన భావించారు. అరండల్‌ గతంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యురాలి (నామినేటెడ్‌)గా పనిచేశారు. కానీ మొరార్జీ ప్రతిపాదనను ఆమె తిరస్కరించారు. దీంతోపాటు అధికార జనతా పార్టీలోనూ ఆయన ప్రతిపాదనకు తగినంత మద్దతు లభించలేదు. దీంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని