రైళ్లలో వృద్ధుల రాయితీ కొనసాగించలేం

ప్రయాణికుల రాయితీలతో మోయలేని భారం పడుతోందని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. కొందరు మినహా అన్ని వర్గాలవారికీ ఈ సదుపాయాన్ని పునరుద్ధరించే అవకాశాన్ని తోసిపుచ్చారు. ఈ మేరకు బుధవారం

Published : 21 Jul 2022 03:33 IST

పార్లమెంటులో మంత్రి జవాబు

దిల్లీ: ప్రయాణికుల రాయితీలతో మోయలేని భారం పడుతోందని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. కొందరు మినహా అన్ని వర్గాలవారికీ ఈ సదుపాయాన్ని పునరుద్ధరించే అవకాశాన్ని తోసిపుచ్చారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభకు రాతపూర్వక సమాధానమిచ్చారు. ‘‘టికెట్‌ ధర తక్కువగా ఉన్న కారణంగా ప్రయాణ వ్యయంలో సగటున 50 శాతాన్ని రైల్వేయే భరిస్తోంది. ఇది కాకుండా కొవిడ్‌-19 కారణంగా గత రెండేళ్లలో ప్రయాణికుల టికెట్ల ఆదాయం తగ్గిపోయింది. ఇవి రైల్వే ఆర్థిక పరిస్థితిపై దీర్ఘకాలం ప్రభావం చూపిస్తాయి. రాయితీలు ఎంతో భారంగా మారాయి. వయో వృద్ధులు సహా మొత్తం అన్ని వర్గాలకూ రాయితీలను విస్తరించడం వాంఛనీయం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వైకల్యం ఉన్న నాలుగు విభాగాల వారికి, 11 రకాల రోగులకు, విద్యార్థులకు రాయితీలు కొనసాగిస్తున్నాం’’ అని వివరించారు. 2017-20 మధ్య వయో వృద్ధుల రాయితీల రూపంలో రూ.4,794 కోట్లను కోల్పోయామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని