Corona Variants: ఈ వేరియంట్లతో భారీగా గాల్లోకి వైరస్‌

కరోనాలో ఏ వేరియంట్‌ బారినపడ్డ వారి నుంచి ఎక్కువగా వైరస్‌ వెలువడుతుందన్నదానిపై శాస్త్రవేత్తలు తాజాగా అధ్యయనం చేశారు. కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవ్‌-2లోని ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్‌ సోకినవారి నుంచి ఎక్కువగా వైరస్‌ రేణువులు గాల్లోకి

Published : 20 Aug 2022 08:10 IST

దిల్లీ: కరోనాలో ఏ వేరియంట్‌ బారినపడ్డ వారి నుంచి ఎక్కువగా వైరస్‌ వెలువడుతుందన్నదానిపై శాస్త్రవేత్తలు తాజాగా అధ్యయనం చేశారు. కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవ్‌-2లోని ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్‌ సోకినవారి నుంచి ఎక్కువగా వైరస్‌ రేణువులు గాల్లోకి వెలువడతాయని తేల్చారు. బాధితుల శ్వాస నుంచి గాల్లోకి చేరిన సూక్ష్మ తుంపర్లను పీల్చడం కూడా కొవిడ్‌ వ్యాప్తికి ఎక్కువగానే కారణమవుతున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అమెరికాలోని మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. 2020 మధ్య నుంచి 2022 ఆరంభం మధ్య కొవిడ్‌ బారినపడ్డ 93 మంది ఆరోగ్యాన్ని పరిశీలించారు. వారి ముఖంపై శంఖం ఆకారంలో ఒక పరికరాన్ని ఉంచారు. అరగంట పాటు పాడటం, బిగ్గరగా అరవడం, దగ్గడం, తుమ్మడం చేయాలని వారికి సూచించారు. ఈ క్రమంలో పరీక్షార్థుల నాసికం నుంచి వెలువడ్డ రేణువులను ఒక యంత్రం పరిశీలించింది. వాటిలో 5 మైక్రోమీటర్ల మేర ఉన్న తుంపర్లను అది వేరు చేసింది. ఇవి సర్జికల్‌ మాస్కులు, దుస్తుల గుండా కూడా లీక్‌ కాగలవు. గాల్లో ఎక్కువసేపు ఉండగలవు. వాటిలో వైరస్‌ పరిమాణాన్ని పరిశీలించారు. ఇతర రకాలతో పోలిస్తే ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్ల బారినపడిన వారి నుంచి ఈ వైరస్‌ రేణువులు ఎక్కువగా విడుదలవుతున్నట్లు గుర్తించారు. ఈ విషయంలో ఈ మూడు వేరియంట్లు దాదాపు సమాన స్థాయిని కలిగి ఉన్నట్లు వారు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని