రాత్రివేళ.. ‘కజిరంగా’లో సద్గురుతో షికారు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, సద్గురు జగ్గీ వాసుదేవ్‌ల  కజిరంగా జాతీయ పార్కు సందర్శన వివాదాస్పదమైంది. రాత్రివేళ సఫారీకి వెళ్లడం.. వన్యప్రాణి సంరక్షణ నిబంధనల ఉల్లంఘనేనంటూ ఫిర్యాదులు వచ్చాయి. అస్సాం

Published : 27 Sep 2022 06:22 IST

అస్సాం సీఎం హిమంత చర్యపై ఫిర్యాదు

గువాహటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, సద్గురు జగ్గీ వాసుదేవ్‌ల  కజిరంగా జాతీయ పార్కు సందర్శన వివాదాస్పదమైంది. రాత్రివేళ సఫారీకి వెళ్లడం.. వన్యప్రాణి సంరక్షణ నిబంధనల ఉల్లంఘనేనంటూ ఫిర్యాదులు వచ్చాయి. అస్సాం పర్యాటక మంత్రి జయంత మల్లా బారువాతోపాటు హిమంత, సద్గురు.. గత శనివారం షెడ్యూలు సమయం ముగిశాక కజిరంగా పార్కులో పర్యటించారంటూ ఇద్దరు ఉద్యమకారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం.. షెడ్యూల్‌ సమయం తర్వాత అక్కడ సఫారీ చేయడం నిషేధం. ‘చట్టం ముందు అందరూ సమానులే. ఉల్లంఘనకు పాల్పడినందుకు వారిని అరెస్టు చేయాలి’ అని ఉద్యమకారుడు సోనేశ్వర్‌ నరా ఆరోపించారు. ఈ సందర్శన సమయంలో సద్గురు ఎస్‌యూవీ వాహనం నడపగా.. హిమంత, బారువా, కొందరు సిబ్బంది వెంట ఉన్నారు. అస్సాం సీఎం  హిమంత బిశ్వశర్మ ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. ‘చట్టం ప్రకారమే.. రక్షిత ప్రాంతంలో పర్యటించేందుకు మాకు వార్డెన్‌ అనుమతి ఇచ్చారు. ఎలాంటి ఉల్లంఘన జరగలేదు’ అన్నారు. అటవీ సంరక్షణ విభాగం ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చీకటి పడిందని చెప్పి వారి పర్యటన రద్దు చేయడం సరి కాదు’ అని వెల్లడించారు. ఈ విషయమై తాము ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts