Costliest Dog: ఈ శునకం.. ఖరీదులో ‘కనకం’.. ధర తెలిస్తే అవాక్కవుతారు!

దసరా వేడుకల్లో భాగంగా కర్ణాటకలోని శివమొగ్గలో ఆదివారం రాష్ట్ర స్థాయి పెంపుడు జంతువుల ప్రదర్శన జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు పోటీల్లో పాల్గొన్నారు. 22 జాతుల శునకాలతో వాటి యజమానులు వచ్చారు.

Updated : 04 Oct 2022 09:23 IST

శివమొగ్గ, న్యూస్‌టుడే: దసరా వేడుకల్లో భాగంగా కర్ణాటకలోని శివమొగ్గలో ఆదివారం రాష్ట్ర స్థాయి పెంపుడు జంతువుల ప్రదర్శన జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు పోటీల్లో పాల్గొన్నారు. 22 జాతుల శునకాలతో వాటి యజమానులు వచ్చారు. బెంగళూరుకు చెందిన వ్యాపారి, జాగిలాల ప్రియుడు ‘కడబం’ సతీశ్‌ తీసుకొచ్చిన టిబెటియన్‌ మస్టిఫ్‌ జాతి జాగిలం ‘భీమ’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ.10 కోట్లు ఖర్చు చేసి, గత ఏడాది చైనాలోని బీజింగ్‌ నుంచి ప్రత్యేక విమానంలో భీమను తెప్పించినట్లు ఆయన చెప్పారు. ఈ జాగిలంతో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు స్థానికులు పోటీ పడ్డారు. భీమ కోసం ఏసీ గది సదుపాయాలతో పాటు ఆహారానికి నెలకు రూ.25 వేలు ఖర్చు చేస్తున్నట్లు సతీశ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని