సుప్రీంకోర్టుకు సొంత లైవ్‌ ఛానల్‌!

న్యాయస్థానంలో జరిగే కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారాలకు గాను సొంతంగా మౌలిక సదుపాయాలను సమకూర్చుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది.

Updated : 26 Nov 2022 05:09 IST

కోర్టు ఔన్నత్యాన్ని కాపాడాలి : సీజేఐ

దిల్లీ: న్యాయస్థానంలో జరిగే కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారాలకు గాను సొంతంగా మౌలిక సదుపాయాలను సమకూర్చుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. అర్హులైన న్యాయవాదులకు, న్యాయ కళాశాలలకు వీటి అనుమతులు ఇస్తామని.. అత్యున్నత న్యాయస్థానం ఔన్నత్యాన్ని కాపాడవలసిన బాధ్యత తమపై ఉందని పేర్కొంది. కొన్నిసార్లు సమయం, సందర్భం లేకుండా చిన్న క్లిప్పులు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కొహ్లీల ధర్మాసనం అభిప్రాయపడింది. సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ కోర్టు ప్రత్యక్ష ప్రసారాలపై వాదనలు వినిపిస్తుండగా న్యాయమూర్తులు పై వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసారాలతోపాటు కోర్టు రికార్డుల డిజిటలైజేషనుకు దేశవ్యాప్తంగా ఏకరూప నియమాలు రూపొందించాలని ఆమె కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని