మహిళల రక్షణకు నిర్భయ ‘బ్రేస్‌లెట్‌’

మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థినులు ఓ వినూత్న పరికరం తయారు చేశారు.

Published : 30 Nov 2022 03:54 IST

మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థినులు ఓ వినూత్న పరికరం తయారు చేశారు. గోరఖ్‌పుర్‌ జిల్లాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చదువుతున్న స్నేహ, అక్షిత ఈ పరికరాన్ని తయారుచేశారు. దీన్ని లాగేందుకు ప్రయత్నం చేసినప్పుడు అందులోంచి కరెంట్‌ విడుదలై షాక్‌ కొట్టేలా బ్యాటరీని ఏర్పాటు చేశారు. ‘‘ఈ పరికరం ఫోన్‌ ద్వారా ఉమెన్‌ సేఫ్టీ యాప్‌నకు అనుసంధానమై ఉంటుంది. మరో ఐదు నంబర్లకు కనెక్ట్‌ అయి ఉంటుంది. ఎప్పుడైనా ప్రమాదం ఎదురైనప్పుడు పరికరంలోని బటన్‌ను రెండు సార్లు నొక్కాలి. వెంటనే ఆ నంబర్లకు కాల్‌తో సహా ఒక సందేశం వెళ్తుంది. ప్రస్తుతం ఉన్న లొకేషన్‌ సైతం షేర్‌ అవుతుంది. ఈ పరికరం బ్లూటూత్‌ ద్వారా పనిచేస్తుంది. దీని ధర రెండు వేల రూపాయలు’’ అని స్నేహ, అక్షిత తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు