నాకు పెళ్లి చేయండి ప్లీజ్‌.. మెజిస్ట్రేట్‌ను వేడుకున్న మరుగుజ్జు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి జిల్లా హారాజ్‌గంజ్‌ తహసీల్‌కు చెందిన మరుగుజ్జు మొహమ్మద్‌ షరీఫ్‌(40) ఎత్తు రెండున్నర అడుగులు మాత్రమే.

Updated : 01 Dec 2022 07:13 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి జిల్లా హారాజ్‌గంజ్‌ తహసీల్‌కు చెందిన మరుగుజ్జు మొహమ్మద్‌ షరీఫ్‌(40) ఎత్తు రెండున్నర అడుగులు మాత్రమే. దీంతో అతను ఎటువంటి కష్టతరమైన పనులు చేయలేడు. కుటుంబ సభ్యులు అతణ్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నాడు. ఒంటరిగా ఉండటం వల్ల మానసికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని షరీఫ్‌ చెబుతున్నాడు. తనకు వివాహం జరిపించాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను వేడుకున్నాడు. విజ్ఞప్తిని స్వీకరించిన జిల్లా మేజిస్ట్రేట్‌ మాల శ్రీవాస్తవ. అందుకు తగినట్లుగా చర్యలు తీసుకుంటామని షరీఫ్‌కు హామీ ఇచ్చారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు