Updated : 04 Nov 2020 20:13 IST

ట్రంప్‌ Vs బైడెన్‌: ఏ రాష్ట్రంలో ఆధిక్యమెంత?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. శ్వేతసౌధంలో కొలువుదీరేది డెమొక్రాట్లా? రిపబ్లికన్లా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రత్యర్థి జో బైడెన్‌ల మధ్య హోరా హోరీగా కొనసాగుతున్న ఈ పోరులో గెలుపు ఎవరి సొంతమవుతుందోనని యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మ్యాజిక్‌ ఫిగర్‌కు 270 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు జరిగిన లెక్కింపులో డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి  జో బైడెన్‌కు 238 ఎలక్టోరల్‌ ఓట్లు రాగా.. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌నకు 213 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చినట్టు అమెరికా మీడియా వెల్లడించింది. ఇంకా ఏడు రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది.

ట్రంప్‌ (213)

అలబామా (9), అర్కన్‌సస్‌ (6), ఫ్లోరిడా (29), ఇదహో (4), ఇండియానా (11), అయోవా (6), కాన్సాస్‌ (6), కెంటకీ (8), లూసియానా (8), మిసిసిపి (6), మిస్సోరి (10), మాంటానా (3), నెబ్రాస్క (4), నార్త్‌ డకోటా (3), ఒహైయో (18), ఒక్లహామా (7), సౌత్‌ కరోలినా (9), సౌత్‌ డకోటా (3), టెన్నీసె (11), టెక్సాస్‌ (38), ఉతా (6), వెస్ట్‌ వర్జీనియా (5), వ్యోమింగ్‌ (3) రాష్ట్రాల్లో ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి.

జో బైడెన్‌ (238)

ఆరిజోనా (11), కాలిఫోర్నియా (55), కొలరాడో (9), కనెక్టికట్‌ (7), డెలావర్‌ (3), డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా (3), హవాయి (4), ఇల్లినాయిస్‌ (20), మెయిన్‌ (3), మేరీల్యాండ్‌ (10), మసాచుసెట్స్‌ (11), మిన్నెసొటా (10), నెబ్రాస్కా (1), న్యూహ్యాంపిషైర్‌ (4), న్యూ జెర్సీ (14), న్యూ మెక్సికో (5), న్యూయార్క్‌ (29), ఓరిగాన్‌ (7), రోడ్‌ ఐలండ్‌ (4), వెర్మోంట్‌ (3), వర్జీనియా (13), వాషింగ్టన్‌ (12) రాష్ట్రాల్లో ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి.

ఇంకా ఫలితం తేలాల్సిన రాష్ట్రాలివే..

అలస్కా, జార్జియా, మిషిగాన్‌, నెవాడ, నార్త్‌ కరోలినా, పెన్సిల్వీనియా, విస్కాన్సిన్‌

మిషిగన్ ఫలితంపై ఉత్కంఠ!
మిషిగన్‌ రాష్ట్రంలో ట్రంప్‌, బైడెన్‌ మధ్య హోరా హోరీగా ఉంది.  ఇక్కడ ట్రంప్‌ కేవలం 1.4 శాతం ఆధిక్యంతో కొనసాగుతున్నారు. అయితే, ఇంకా 10లక్షల డెట్రాయిట్‌ ఓట్లు లెక్కించాల్సి ఉంది. డెట్రాయిట్‌ ప్రాంతంలో డెమొక్రాట్లకు బాగా పట్టుంది. ఈ నేపథ్యంలో మిషిగన్‌ (16) ఫలితంపై రెండు పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, జార్జియా, నెవాడలలో కౌంటింగ్‌ను నిలిపివేశారు. జార్జియాలో ఇప్పటికే  92శాతం ఓట్ల లెక్కింపు పూర్తయింది.  ఇంకా లక్షా 27 వేల ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇక్కడ ట్రంప్‌నకు లక్ష ఓట్ల మెజార్టీ ఉంది. మరోవైపు, నెవాడాలో ఓట్ల లెక్కింపు నిలిపివేయడంతో ఫలితం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒకటి కంటే తక్కువ శాతం ఓట్ల ఆధిక్యంలో బైడెన్‌ కొనసాగుతున్నారు. నెవాడా (4) ఫలితంపై ఇరు పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts