Rajnath Singh: సవాల్‌ విసిరితే.. భారత్‌ దేనికైనా సిద్ధమే! రాజ్‌నాథ్‌ సింగ్‌

సవాళ్లు ఏ రూపంలో ఎదురైనా దీటుగా స్పందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పేర్కొన్నారు.

Published : 07 Mar 2024 14:47 IST

దిల్లీ: సరిహద్దులో భిన్న సవాళ్లు ఎదురవుతోన్న వేళ.. వాటికి పదునైన జవాబు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) ఉద్ఘాటించారు. సవాళ్లు ఏ రూపంలో ఎదురైనా దీటుగా స్పందిస్తుందన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌ నిర్వహించిన ‘డిఫెన్స్‌ సమ్మిట్‌’లో మాట్లాడిన ఆయన.. శాంతి సమయంలోనూ యుద్ధానికి సంసిద్ధతతో ఉండాలన్నారు. చైనా సరిహద్దులో కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటోన్న వేళ రక్షణమంత్రి ఈ విధంగా స్పందించారు.

‘భూ, గగనతల, సముద్ర మార్గం.. ఇలా ఏవైపు నుంచి భారత్‌పై దాడి చేసినా మన దళాలు సరైన విధంగా స్పందిస్తాయి. మనం ఎవ్వరి భూభాగాన్ని ఆక్రమించలేదు. కానీ, ఎవరైనా మనపై దాడి చేస్తే దీటుగా సమాధానం చెప్పగల స్థితిలో ఉన్నాం. భారత్‌పై ఎవరైనా కన్నెర్ర చేసి.. తప్పించుకునే పరిస్థితి లేదు’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. గల్వాన్‌లో చైనా బలగాలతో చోటుచేసుకున్న ఘర్షణలో భారత సైన్యం చూపించిన తెగువను ప్రస్తావించిన ఆయన.. మనది ప్రస్తుతం బలహీన దేశం కాదన్నారు.

ఇంటి పని చేయాలని భార్యను కోరడం క్రూరత్వం కాదు: దిల్లీ హైకోర్టు

కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షణ రంగానికి మరింత ప్రాధాన్యత పెంచామని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆత్మనిర్భరతను ప్రోత్సహించామని, భారత్‌లో తయారీతోపాటు సైన్యం ఆధునికీకరణపై దృష్టి పెట్టామన్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను తీసుకొచ్చామని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు