Corona: వెయ్యి దిగువకు మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి నిదానంగా తగ్గుముఖం పడుతోంది.

Published : 28 Jun 2021 09:41 IST

సుమారు రెండున్నర నెలల తర్వాత తగ్గుదల

కొత్తగా 46,148 కేసులు

 

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా 46,148 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 7.7 శాతం తగ్గుదల కనిపించింది. నిన్న మరో 979 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు రెండున్నర నెలల తర్వాత తొలిసారి వెయ్యిలోపు మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 3,02,79,331 చేరగా..3,96,730 మంది ప్రాణాలు కోల్పోయారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. అలాగే నిన్న 15,70,515 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 

ఇక క్రియాశీల కేసులు 5,72,994కు చేరాయి. క్రియాశీల రేటు 1.89 శాతానికి పడిపోగా..రికవరీ రేటు 96.80 శాతానికి పెరిగింది. నిన్న 58,578 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.93 కోట్లు మార్కును దాటాయి. మరోపక్క నిన్న 17,21,268 మంది టీకాలు వేయించుకున్నారు. గతం వారం నుంచి చూస్తే..నిన్న టీకా పంపిణీలో భారీ తగ్గుదల కనిపించింది. ఇప్పటివరకు 32,36,63,297 మందికి టీకాలు అందాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని