కొవిడ్ సెకండ్ వేవ్‌: ఏప్రిల్‌లో గరిష్ఠానికి..

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలో విపరీతంగా పాజిటివ్‌ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్ ప్రవేశించిందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే దేశంలో ఫిబ్రవరి నుంచి పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం కొవిడ్‌ సెకండ్ వేవ్ వ్యాప్తికి నిదర్శనమని స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తాజా నివేదికలో వెల్లడించింది...

Updated : 25 Mar 2021 17:56 IST

నివేదిక వెల్లడించిన ఎస్‌బీఐ

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలో విపరీతంగా పాజిటివ్‌ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్ ప్రవేశించిందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే దేశంలో ఫిబ్రవరి నుంచి పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం కొవిడ్‌ సెకండ్ వేవ్ వ్యాప్తికి నిదర్శనమని స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తాజా నివేదికలో వెల్లడించింది. ‘ సెకండ్‌ వేవ్‌ ఫిబ్రవరి 15 నుంచి 100 రోజులు ఉండనుంది. దీంతో రానున్న ఏప్రిల్ మధ్య నాటికి దేశవ్యాప్తంగా వైరస్‌ తీవ్రరూపం దాల్చనుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది సెకండ్ వేవ్‌లో వైరస్‌ బారిన పడే అవకాశం ఉంది’ అని బ్యాంకు నివేదిక ద్వారా అంచనా వేసింది. 

లాక్‌డౌన్‌, ఆంక్షలు విధించడం వైరస్‌ వ్యాప్తిపై అంతగా ప్రభావం చూపకపోవచ్చు. ఇప్పటికే పెరిగిపోతున్న పాజిటివ్‌ కేసుల వల్ల దేశంలో కొన్ని వ్యాపార రంగాలు ఆర్థికంగా క్షీణించాయి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, ఆంక్షలు విధించడంతో మరిన్ని వ్యాపార రంగాలు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఒక్కటే సరైన మార్గంలా కనిపిస్తోందని ఎస్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34 లక్షల డోసులను పంపిణీ చేస్తున్నారు. వీటిని రోజుకి 40 నుంచి 45 లక్షలకు పెంచినప్పటికీ.. 45 ఏళ్లకు పైన వారందరికీ టీకా అందించడానికి మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని