Mehul Choksi: డొమినికా పోలీసుల అదుపులో మెహుల్ చోక్సీ!

అంటిగ్వా నుంచి అదృశ్య‌మైన వ‌జ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీని డొమినికాలో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు స్థానిక మీడియా తెలిపింది.

Updated : 27 May 2021 09:21 IST

డొమినికా: అంటిగ్వా నుంచి అదృశ్య‌మైన వ‌జ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీని డొమినికాలో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ నెల 25న చోక్సీ అంటిగ్వా నుంచి పారిపోగా అతని ఆచూకీ కోసం ఇంట‌ర్‌పోల్ ఎల్లో నోటీస్ జారీ చేసింది. డొమినికాలో గుర్తించిన చోక్సీని అంటిగ్వా పోలీసుల‌కు అప్ప‌గించే ప్ర‌యత్నాలు కొన‌సాగుతున్నాయి. చోక్సీ స‌ముద్ర మార్గం ద్వారా అక్ర‌మంగా డొమినికాకు వెళ్లి ఉండ‌వ‌చ్చ‌న్న అంటిగ్వా ప్ర‌ధాని.. భార‌త్, అంటిగ్వాకు డొమినికా ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తుంద‌ని తెలిపారు. డొమినికాలోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన చోక్సీని నిర్భందించాల‌ని.. అత‌డిని అటు నుంచి అటే భార‌త్‌కు పంపాల‌ని అంటిగ్వా ప్ర‌ధాని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని