Center: ఆ రోజు మోదీ, జిన్‌పింగ్ ఏం మాట్లాడుకున్నారంటే..?

ఎనిమిదినెలల క్రితం ఇండోనేషియాలో జరిగిన సదస్సులో ప్రధాని మోదీ(PM Modi), చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్(Chinese President Xi Jinping) కాసేపు మాట్లాడుకున్నారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను తాజాగా విదేశాంగ శాఖ వెల్లడించింది. 

Updated : 28 Jul 2023 13:45 IST

దిల్లీ: గత ఏడాది G20(G 20) సదస్సులో ప్రధాని మోదీ(PM Modi), చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(Chinese President Xi Jinping) మధ్య జరిగిన సంభాషణ గురించి తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆ సమయంలో జరిగిన విందు కార్యక్రమంలో వారిద్దరు మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారని తెలిపింది. అప్పుడు వారిద్దరు ద్వైపాక్షిక సంబంధాలను సుస్థిరం చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడుకున్నారని పేర్కొంది.

మోదీ(Modi), జిన్‌పింగ్‌(Xi Jinping) బాలి సదస్సులో ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించేలా ఒక ముఖ్యమైన ఏకాభిప్రాయానికి వచ్చారని ఇటీవల చైనా వెల్లడించింది. ఈ క్రమంలోనే భారత్‌ నుంచి తాజా స్పందన వచ్చింది. ‘భారత్‌-చైనా సరిహద్దు వద్ద పశ్చిమ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న సమస్యను పరిష్కరించడం, సరిహద్దు వెంబడి ప్రశాంతతను నెలకొల్పడం కీలకం. ఇవే రెండు దేశాల మధ్య ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు దోహదం చేస్తాయి. అదే మా స్థిరమైన వైఖరి కూడా’ అని వెల్లడించారు.

ప్రాణాపాయం నుంచి బయటపడిన తెలుగు విద్యార్థిని

గత ఏడాది సెప్టెంబరులో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో భాగంగా.. మోదీ(Modi), జిన్‌పింగ్‌(Xi Jinping) ఒకరికొకరు ఎదురుపడినప్పటికీ పలకరించుకోకపోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన జీ20 సదస్సులో వీరిద్దరు పలకరించుకున్నారు. 2020 తర్వాత ఇరువురు ముఖాముఖి భేటీ కావడం ఇదే మొదటిసారి. అదే ఏడాదిలో భారత్‌- చైనాల మధ్య గల్వాన్‌ లోయలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. దౌత్య, సైనిక స్థాయిలో పలుమార్లు చర్చలతో.. కొన్ని ప్రాంతాల్లో ఇరువైపులు బలగాలు వెనక్కి తగ్గాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు