Mulayam: ఆసుపత్రిలో చేరిన ములాయం  

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా

Updated : 01 Jul 2021 17:04 IST

గురుగ్రామ్‌: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, వయసు రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో ములాయం బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అన్ని పరీక్షలు చేస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. గతేడాది అక్టోబరులో కరోనా బారిన పడి కోలుకున్న ములాయం.. ఇటీవలే టీకా కూడా వేయించుకున్నారు. 

81ఏళ్ల  ములాయం.. ఉత్తరప్రదేశ్‌కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1996-98 మధ్య కేంద్ర రక్షణమంత్రిగానూ వ్యవహరించారు. ఆయన కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌ కూడా యూపీ సీఎంగా పనిచేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని